Wednesday 12 July 2017

నిరుద్యోగులకు శుభవార్త : IBPS నోటిఫికేషన్ విడుదల

22:18





బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే యువత కలలను సాకారం చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తాజా ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక జాతీయ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ కు సంబంధించి 3 వేల 247 ఖాళీలను భర్తీ చేసేందుకు IBPS కామన్ రిటన్ ఎగ్జామినేషన్ (CWE PO/MT – VII) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో జనరల్‌ కేటగిరీకి 1,723, ఎస్సీలకు 482, ఎస్టీలకు 236, OBCలకు 806 పోస్టులు కేటాయించారు.
బ్యాంకులు – ఖాళీలు ఇలా ఉన్నాయి : అలహాబాద్‌ బ్యాంక్‌ 447, ఆంధ్రా బ్యాంక్‌ 200, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 200, కెనరా బ్యాంక్‌ 900, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 200, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 300, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 400, పంజాబ్‌ అండ్ సింధ్‌ బ్యాంక్‌ 100, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 400, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in చూడవచ్చు

Sorry Dhinchak Pooja fans, you will no longer find ‘Selfie Maine Le Li Aaj’ on YouTube

07:07

Dhinchak Pooja became popular on the Internet after her songs like 'Swag Wali Topi', 'Selfie Maine Le Li Aaj' went viral for not exactly the right reasons. Foraying into cringe-worthy pop, Pooja made sure all her songs were tone-deaf and off-note. 

According to news reports, someone who goes by the name 'Kathappa Singh' reported her songs, following which YouTube removed her songs. (Source: File Photo)


జయ జానకి నాయక టీజర్ రిలీజ్

01:52
జయ జానకి నాయక అనే తాజా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ప్రతీ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‑‑టైనర్‑గా ప్రమోట్ చేసే బోయపాటి ఈ సినిమాను మాత్రం లవ్ స్టోరిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాలేజ్ స్టూడెంట్‑గా కనిపిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఫస్ట్ లుక్‑ను కూడా రొమాంటిక్ ఎంటర్‑టైనర్ అనిపించేలా డిజైన్ చేసిన చిత్రయూనిట్ టీజర్‑ను కూడా అదే స్టైల్‑లో రిలీజ్ చేసింది. బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా లేకుండానే కూల్ కాలేజ్ లవ్ స్టోరీలా టీజర్‑ను కట్ చేశారు.

అటవీ శాఖలో 10 వేల ఉద్యోగాలు

01:35
జనవరి 15 లోపు అటవీ శాఖలోని ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ తో పాటు దాదాపు 10వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. దీంతో పాటు బీసీ హాస్టళ్ళను బలోపేతం చేస్తామని అన్నారు. హాస్టల్ విద్యార్థులకు బయో మెట్రిక్ విధానాన్ని  ప్రవేశ పెడ్తామని…హాస్టళ్ళను ఇంటర్ వరకు పొడగిస్తామని అన్నారు. వచ్చే ఏడాది బీసీ స్టడీ సర్కిళ్ళను పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పారు.