Wednesday 12 July 2017

జయ జానకి నాయక టీజర్ రిలీజ్

జయ జానకి నాయక అనే తాజా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ప్రతీ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‑‑టైనర్‑గా ప్రమోట్ చేసే బోయపాటి ఈ సినిమాను మాత్రం లవ్ స్టోరిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాలేజ్ స్టూడెంట్‑గా కనిపిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఫస్ట్ లుక్‑ను కూడా రొమాంటిక్ ఎంటర్‑టైనర్ అనిపించేలా డిజైన్ చేసిన చిత్రయూనిట్ టీజర్‑ను కూడా అదే స్టైల్‑లో రిలీజ్ చేసింది. బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా లేకుండానే కూల్ కాలేజ్ లవ్ స్టోరీలా టీజర్‑ను కట్ చేశారు.

No comments:

Post a Comment