Wednesday, 12 July 2017

టెన్త్ విద్యార్థులకు హరితహారం బొనంజా





మొక్కలు నాటడంలో చురుగ్గా వ్యవహరిస్తూ.. వాటిని చక్కగా పరిరక్షించే టెన్త్ విద్యార్థులకు సైన్స్‌లో ఐదు గ్రేస్ మార్కులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి జోగు రామన్న. మంగళవారం ( జూలై-11) హైదరాబాద్ సనత్‌నగర్‌లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేషనల్ గ్రీన్ కార్ప్స్ విద్యార్థుల రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం విజయవంతానికి 2.5 లక్షల మంది విద్యార్థులతో 5000 ఈకో క్లబ్‌లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఒక్కోక్లబ్‌లో 10 మంది విద్యార్థులతో ఒక గ్రూపు ఏర్పాటుచేసి, ఐదు గ్రూపులు కలిపి 50 మందితో హరితదళాలను రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను మాత్రమే వాడాలని మంత్రి కోరారు.

No comments:

Post a Comment